Auto drivers | మల్కాజిగిరి, జూలై 13 : ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సేఫ్టీ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని హృదయపూర్వకంగా కలిసి తమ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు.
వెంటనే ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన ఎల్లవేళలా పోరాడుతానని మీకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కార్మికులకు సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ కింద ఐదు లక్షల ఇన్సూరెన్స్ స్కీమును రెన్యువల్ చేయాలని.. డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసే విధంగా పోరాడుతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఆత్తిన మోని నగేష్ కుమార్, వీరయ్య, షఫీహుద్దీన్, రాజు యాదవ్, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం