100 Days plan | జిన్నారం, జూన్ 5: బొల్లారం మున్సిపల్ పరిధిలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది పార్కులు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. పర్యావరణ దినోత్సవంపై పాత మున్సిపల్ కార్యాలయం ముందు గల గాంధీ చౌరస్తాలో మానవహారాన్ని నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం పార్రిశామిక ప్రాంతంలో మొక్కలు నాటడం ఎంతో ఆవశ్యకమన్నారు. 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్వో నర్సింలు, ఏఈ కిష్టయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ప్రదీప్, రఘురాంరెడ్డి, అలీ, నారాయణ, మహబూబ్, కార్యాలయ సిబ్బంది మహేందర్, సునీత, మెప్మా సిబ్బంది, గ్రూప్ సంఘాల మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు