Road Safety Awareness winner | రామంతాపూర్, ఏప్రిల్ 20 : సర్వేజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలిలో ఇవాళ జరిగిన రహదారి భద్రత అవగాహన సదస్సులో బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది. ముందస్తుగా నిర్వహించబడిన ప్రాథమిక పోటీలలో దాదాపు 11వేల పాఠశాలలు పాల్గొనగా.. ఈ పోటీలలో రామంతాపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రైమరీ విభాగానికి చెందిన విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచి 50 వేల నగదు బహుమతిని గెలుచుకున్నారు.
ఫౌండేషన్ సీఈవో డాక్టర్ జనార్దన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ సమక్షంలో పాఠశాల ప్రాచార్యులు సల్లారo నరసింహారెడ్డి చెక్కును అందుకున్నారు. రహదారి భద్రతలో గొప్ప మార్పును తీసుకువచ్చే అనుసంధానకర్తలుగా విద్యార్థుల ప్రయత్నాన్ని కార్యనిర్వాహకులు అభినందించారు. వీరు బృందంగా ఏర్పడి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ ప్రదర్శనకు శ్రీకారం చుట్టి విజేతలుగా నిలవడం అనన్య సామాన్యం అన్నారు.
ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి మాట్లాడుతూ.. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయులతోపాటుగా నిరంతరం విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహించే పాఠశాల ప్రాచార్యులు డాక్టర్ సల్లారం నరసింహారెడ్డి కృషి ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తల్లిదండ్రులను, విద్యార్థులను అభినందించారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?