శామీర్‌పేట: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద బాధితులు దరఖాస్తు చేసుకోగా మంజూరైన నగదుకు సంబంధించిన చెక్కును సోమవారం మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో శామీర్‌పేట మండలానికి చెందిన కేసీఆర్ సేవాదళ్ నాయకులు వెంకట్‌రెడ్డి, కోటేష్, సంతోష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.