MLA Mallareddy | బోడుప్పల్, జూన్ 11 : ల్యాండ్ ఫూలింగ్పై త్వరితగతిన నిర్ణయం తీసుకొని బొడుప్పల్ దళితులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌ను కోరారు. బొడుప్పల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 63/2 నుండి 63/25 లోని 336 ఎకరాల పెద్ద కంచను ల్యాండ్ ఫూలింగ్ కింద అభివృద్ధి చేసి దళితులకు ఎకరాకు 600 చదరపు గజాల స్థలాన్ని అందివ్వాలని కోరారు.
ఈ మేరకు బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, దళిత నాయకులతో కలిసి హెచ్ఎండీఏ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ త్వరలోనే దళితుల భూ పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించినట్లు సంజీవరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, దళిత నాయకులు సీహెచ్ కుమార్, నరసింహ, చంటి శ్రీనివాస్, ఉప్పరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్‌లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు