Illegal Constructions | కాప్రా, జూలై 17 : కాప్రా సర్కిల్లో అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో నిత్యం వాటిని గుర్తించి ఉన్నతాధికారులకు రిపోర్టు చేయాల్సిన చైన్మెన్లు, తమ విధులను సక్రమంగా నిర్వహించకపోవడమే కాక ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తూ వాటిని ప్రోత్సహించే పరిస్థితి తలెత్తిందని.. దీనిని నిరోధించేందుకు క్షేత్రస్థాయి చైన్మెన్లకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమాచారహక్కు సాధన సమితి కన్వీనర్ తాడూరి గగన్‌కుమార్ వినూత్న ప్రక్రియకు గురువారం శ్రీకారం చుట్టారు.
సర్కిల్ పరిధిలోని డివిజన్లు 02, 03లలో అనుమతులు పొందిన నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయి.. అనుమతులకు విరుధ్దంగా జరుగుతున్న కట్టడాలు ఎన్ని, లేదా పూర్తయిన నిర్మాణాల్లో జీహెచ్ఎంసీ అనుమతి ప్రకారం పూర్తయిన నిర్మాణాలు ఎన్ని, నిబంధనలకు విరుద్దంగా పూర్తయిన నిర్మాణాల వివరాలపై సదరు చైన్‌మెన్ అధికారులకు ఎలాంటి రిపోర్టు/సమాచారం వివరాలు, వాటిపై తీసుకున్న చర్యలు ప్రజలకు తెలియజేయాలని కోరుతూ బహిరంగంగా లేఖ రాసి కాప్రా సర్కిల్ కార్యాలయంలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా గగన్‌కుమార్ మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను గుర్తించే టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు అసలు లేకపోవడం, మొత్తం ఒకే ఒక టౌన్‌ప్లానింగ్ డీసీపీ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి చైన్మెన్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, వీటిని నిరోధించేందుకు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం