Palm Trees | పోచారం, జూలై 6 : వెంచర్ అభివృద్ది పేరిట గీత కార్మికులకు ఉపాధినిచ్చే తాటి చెట్లను తొలగించి ఉపాధిని దూరం చేయవద్దని పోచారం మున్సిపాలిటీ కొర్రెముల గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు ఆదివారం ఆందోళనకు దిగారు. సర్వే నంబర్ 311,312,313,324,324,326పి,327లలో దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈ భూమిలోని 85 తాటి చెట్లను ఎలాంటి సమాచారం లేకుండా వెంచర్ నిర్వాహకులు తొలగించడంతో దాదాపు రెండు వందల మంది గౌడ సంఘం సభ్యులు వెంచర్లో దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ర్ట గౌడ సంఘం నాయకుడు పంజాల జైహింద్ గౌడ్ పాల్గొని మద్దతు తెలిపారు. గీత కార్మికుల ఆందోళనకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. ఆయన గీత కార్మికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కొర్రెముల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు బుర్ర వెంకటేశం, మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్, నాయకులు పల్లె బాబురావు, అనిల్ గౌడ్, బైరు పాండు గౌడ్, కట్ట ఆంజనేయులు గౌడ్, దేశగోని బాల్‌రాజ్ గౌడ్ గీత కార్మికులు పాల్గొన్నారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు