Accident | దుండిగల్, ఆగష్టు 12 : అమెరికాలోని చికాగోలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. దీంతో స్థానికంగా ఆమె కుటుంబం నివాసం ఉంటున్న ఇంటివ ద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్దిపేట సమీపంలోని రావురూకుల గ్రామానికి చెందిన శ్రీనివాసవర్మ, హేమలత దంపతులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండిమైసమ్మ ప్రాంతంలోని బాలాజీ కాలనీలో స్థిరపడ్డారు.
వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రీజ వర్మ (23) బీటెక్ పూర్తైన అనంతరం మూడేండ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లగా.. చిన్నకుమార్తె సైతం ఉన్నత విద్యకోసం ఇటీవలే అక్కడికే వెళ్లింది. శ్రీజ వర్మ చికాగోలోని ఈస్టర్న్ ఇల్లీనియస్
-యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేసి ఎలక్ట్రికల్ సైకిల్‌పై అపార్ట్మెంట్ వైపు వస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా దూసుకు వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజ వర్మ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే శ్రీజ వర్మను స్థానికులు, స్నేహితులు వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు పరీక్షించిన డాక్టర్లు ధ్రువీకరించారు.
ప్రమాదం జరిగిన సమయంలో శ్రీజ వర్మ కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్లు డాక్టర్ తేల్చారు. ఈ విషయాన్ని మృతురాలి స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలపడంతో పాటు వీడియో కాల్ ద్వారా శ్రీజ వర్మ మృతదేహాన్ని చూపించడంతో కన్నీరుగా విలపించారు. కాగా మృతదేహాన్ని త్వరగా ఇక్కడకు తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Dharmasthala: ధర్మస్థలిలో మృతదేహాల వెలికితీత.. డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో గుర్తింపు
RS Praveen Kumar | కోడి గుడ్ల కుంభకోణం రూ. 600 కోట్లు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Gunfire | చందానగర్‌లో దొంగల బీభత్సం.. ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు
.