cervical vaccination | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 4 : మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌ను సమూలంగా నివారించేందుకు రాందేవ్ రావు వైద్యశాల కృషి చేస్తుందని వైద్యశాల నిర్వాహకులు విక్రమ్ దేవ్ రావు, మీరారావులు అన్నారు. ఇవాళ కూకట్‌పల్లిలోని రాందేవ్ రావ్ వైద్యశాల, కార్నర్ స్టోన్ సాఫ్ట్వేర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రిక్షా పుల్లర్స్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థినిలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి బాలికలను ఆరోగ్యవంతంగా పెంచితే భవిష్యత్ తరాలు, సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులకు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం సాఫ్ట్వేర్ సంస్థ రూ.24 లక్షలను విరాళంగా అందజేయడం అభినందనీయం అన్నారు.
రాందేవ్ రావ్ వైద్యశాల ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమాజంలో సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించేందుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్ డైరెక్టర్ కమలాకర్, ఛాయాదేవి, ప్రశాంత్ రెడ్డి అపర్ణ రావు, సంస్థ నిర్వాహకులు అభిషేక్ గుప్త, తనికెళ్ళ కిరణ్, భార్గవి, నిశిల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్