MLA Marri Rajashekarreddy | మల్కాజిగిరి, జూన్ 9: బాక్స్ డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యతను పాటించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మచ్చ బొల్లారం డివిజన్ కౌకూర్ ఫార్చ్యూన్ ఎన్క్లేవ్ డ్రైనేజీ అవుట్లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి రూ.1,89 కోట్లతో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కౌకూర్లో ఫార్చ్యూన్ ఎన్ క్లేవ్ లో డ్రైనేజీ అవుట్లైట్ లేక పోవడంతో రోజు డ్రైనేజీ నీరు రోడ్లపైన నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
డ్రైనేజీ శాశ్వత పరిష్కారం కోసం పరిష్కారానికి రూ.1, 89 కోట్లతో డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. ఫార్చ్యూన్ ఎన్క్లేవ్ నుండి హరిప్రియ కాలనీ మీదుగా నాగిరెడ్డి కుంటకు చేరుకునే విధంగా బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫార్చ్యూన్ ఎన్ క్లేవ్ కాలనీవాసులు గౌతమ్, వినోద్ గౌడ్, సీతారామరాజు, సోమోజీ, భుజంగరావు ,సంతోష్, రవికాంత్, పిట్టల శీను, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, లడ్డు నరేందర్ రెడ్డి, శోభన్ బాబు, లక్ష్మణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, సందీప్ రెడ్డి, హనుమాన్ చారి, తిరుపతయ్య, సతీష్, మల్లేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..