Farmer | రెవెన్యూ డిపార్ట్మెంట్లో లంచాలు డిమాండ్ చేయడం.. వారి వేధింపులకు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలు ఇప్పటికే చాలా వెలుగుచూశాయి. ఇప్పుడు అలాంటి ఘటనే పునరావృతమైంది.
ఓ యువ రైతు తన పని కోసం రెవెన్యూ అధికారులు అడిగిన లంచం ఇవ్వలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండల పరిధిలో చోటుచేసుకుంది.
సిద్దు(27) అనే రైతు దుండిగల్ మండలంలో భూదాన్ ద్వారా వచ్చిన తన స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఓ బడా ప్రైవేటు సంస్థకు అప్పగించే కుట్ర చేస్తున్నారని ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లాడు.
తన స్థలానికి కంచె వేయాలని ఎంఆర్ఓ చుట్టూ తిరిగితే.. ఈ పని కోసం అధికారులు రూ.6 లక్షలు డిమాండ్ చేస్తున్నారని బాధిత రైతు సిద్దు ఆరోపిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతును వారించి ఎమ్మార్వో ఆఫీస్లో ఘటనపై ఆరా తీశారు.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
The