Exercise | చర్లపల్లి, మే 31 : ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా శారీరక దృఢత్వం పెంపొందించుకునేందుకు వ్యాయామం ఎంతో అవసరమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ రైల్వే టెర్మినల్ సమీపంలో ఏర్పాటు చేసిన పీఆర్ఓ 9 జిమ్‌ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ వ్యాయమం అలవాటు పరుచుకోవాలన్నారు. యువత సొంతంగా ఉపాధి రంగాన్ని ఎంచుకోవడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్, విజయ్ సింహారెడ్డి, శ్రావణ్ కుమార్, కపిల్, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత