Road Safety Rules | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 15: రోడ్డు దాటే సమయంలో ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఏ నాగరాజు అన్నారు. ఇవాళ కొంపల్లిలో రోడ్డు ప్రమాదాల నివారణపై అల్వాల్ ట్రాఫిక్ సీఐ నాగరాజు నేతృత్వంలో పాదాచారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరించి వాహనాల రాకపోకలను గమనిస్తూ.. సురక్షితంగా రోడ్డు దాటి గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రధాన రహదారులపై రోడ్డు దాటేందుకు పాదాచారులకు ప్రత్యేక ఫుట్ పాత్లను ఏర్పాటు చేశామని.. దానికి అనుగుణంగా ఇతర ప్రాంతాల్లో రోడ్లు దాటేందుకు ప్రయత్నాలు చేయరాదన్నారు.
ఎవరు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటరాదని, రోడ్డు దాటేటప్పుడు వచ్చిపోయే వాహనదారులకు చేయి అడ్డుపెట్టాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలను ప్రతీ ఒక్కరూ పాటించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాలని సీఐ నాగరాజు ఆశించారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్