Fire Accidents | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 17: సహజంగా వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం సూచించింది. ఈ మేరకు ఇవాళ తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ యంత్రాంగం బృందం అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ నెల 14 నుండి 20 వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇవాళ కొంపల్లిలోని సురక్ష చిల్డ్రన్స్ ఆసుపత్రి ప్రాంగణంలో డాక్టర్ ఎంఎస్ రెడ్డి సహకారంతో ఆసుపత్రిలోని సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రతిక్షణం చాలా విలువైందని, అదే సమయంలో 101 డయల్ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు.
తప్పుడు సమాచారం ఇవ్వకుండా ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయం అందేలా పౌరులు బాధ్యతతో ముందుకెళ్లాలన్నారు. దీనికితోడు వాణిజ్య వ్యాపార సంస్థల్లో ప్రతీ ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీపై ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్స్‌తో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత