అమరావతి : విద్యుత్ తీగల మార్పిడికి లంచం తీసుకున్న ఇద్దరు విద్యుత్ ఉద్యోగులతో పాటు మరొకరిని ఏసీబీ(ACB) అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. మేడ్చల్(Medchal) జిల్లా ఘట్కేసర్(Ghatkesar) పరిధిలోని విద్యుత్ శాఖ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు.
11 కేవి లైన్‌ను మార్చడానికి, పాత స్తంభం నుంచి కొత్త స్తంభానికి తీగలు మార్చడానికి మండలానికి చెందిన ఓ వ్యక్తి అధికారులను సంప్రదించాడు.దీనికోసం ఏఈ బలరాం నాయక్ (AE Balaram Naik) రూ. 10 వేలు, లైన్మెన్ హేమంత్ నాయక్( Linemen Hemanth Naik) రూ. 5 వేలు మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. లంచం తీసుకున్న డబ్బును అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే నిర్భయంగా 1064 అనే నంబర్‌కు ఫొన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.