Dundigal | దుండిగల్, ఫిబ్రవరి 18: దుండిగల్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 453, 454 లలో ఆర్టీవో కార్యాలయానికి కేటాయించిన 40 ఎకరాల భూమిని రద్దుచేసి గ్రామస్తులకు పంపిణీ చేయాలని వివిధ పార్టీల నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం నాడు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో భూమిలేని నిరుపేదలు చాలామంది ఉన్నారని, అటువంటి వారికి సర్వేనెంబర్ 453, 454 లో ఆర్టీవో కార్యాలయం నిర్మాణానికి కేటాయించిన 40 ఎకరాల భూమిని పంపిణీ చేసి పట్టాలు అందజేయాలని కోరారు. విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో దుండిగల్ మాజీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరంమాజీ అధ్యక్షులు కావాలి గణేశ్, మాజీ ఎంపీటీసీ బండారి మహేశ్, మాజీ వార్డు సభ్యులు పిట్ల నాగార్జున, షెల్కల లక్ష్మణ్, పిట్ల సత్యనారాయణ, ఆకుల ప్రేమ్ కుమార్ పటేల్, దొంతి మహేశ్ ముదిరాజ్, తలారి రాజ్ కుమార్ ముదిరాజ్, కావలి శశి కుమార్, పండుగ శ్రీశైలం ముదిరాజ్, చిన్నంగి మల్లేశ్, ఉప్పరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.