drugs smugglers | పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారుడిని తెలంగాణా ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి రూ.1.5లక్షలు విలువ చేసే 200 గ్రాముల ఎండీఎంఏ, 60గ్రా ఓపీఎం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీమ్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన వారిపై నిఘా పెట్టింది.
తెలంగాణ ఈగల్ టీమ్ రాజస్థాన్ వెళ్లి వస్తూ డ్రగ్స్ తీసుకొస్తున్న నిందితుడు రాజేందర్‌ను పక్కా సమాచారంతో పేట్‌బషీరాబాద్ పోలీసులతో కలిసి పట్టుకుంది. నిందితుడి నుంచి 10మంది డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?