MLA Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 1: కూకట్పల్లి రామాలయంలో గరుడ స్వామి, ఆంజనేయస్వామి విగ్రహాల ఏర్పాటుకు విరాళాన్ని అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. దేవాలయంలో విగ్రహాల ఏర్పాటు కోసం స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ రూ.2 లక్షల విరాళాన్ని ఇవాళ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ… కూకట్పల్లిలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయాన్ని అద్భుతంగా పునర్ నిర్మించడం జరిగిందన్నారు. దేవాలయ ప్రాంగణంలో 27 అడుగుల గరుడ స్వామి, ఆంజనేయస్వామి విగ్రహాల ఏర్పాటులో భాగంగా నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఈ పనుల కోసం దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం సంతోషకరమన్నారు.
సీతారాముల అనుగ్రహంతో దాతలు, ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆంజనేయులు, చైర్మన్ తులసి రావు లు ఉన్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి