Hydra | పోచారం, ఏప్రిల్ 1 : వాస్తవాలు తెలుసుకోకుండా హైడ్రా కూల్చివేతలు బాధాకరమని దివ్యానగర్ నిర్వాహకుడు నల్ల మల్లారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైడ్రా కూల్చివేతలపై విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు వాస్తవాలు తెలుసుకొని ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకొని కూల్చితే ఎవరికి ఇబ్బంది లేదని, అసలు విషయం తెలుసుకోకుండా దివ్యానగర్లో కూల్చివేతలు చేపట్టి నష్టం కలిగించారని పేర్కొన్నారు.
పోచారం మున్సిపాలిటీ కాచివాని సింగారం పరిధిలోని సర్వే నంబర్ 60లో దివ్యానగర్ పక్కన ఉన్న ఏకశిల నగర్‌ను కలిపే ఎలాంటి రోడ్డు లేదని ఆయన వివరించారు. దివ్యానగర్ ఫేస్2లోని 50 అడుగుల వెడల్పుతో కూడిన రోడ్డు ప్లాట్ నంబర్ 1 , 226 వద్ద ముగుస్తుందని తెలిపారు. అక్కడి నుంచే కాచివాని సింగారం గ్రామం పరిధి ముగుస్తుందని పేర్కొన్నారు. దీనికి ఆనుకునే కొర్రెముల గ్రామ పరిధి ప్రారంభం అవుతుందని మల్లారెడ్డి వివరించారు.
దివ్యానగర్లో అంతమైన 50 అడుగుల రోడ్డుకు అనుకొని కొర్రెముల పరిధిలోని సర్వే నంబర్ 739లో తనకు 21 గుంటల వ్యవసాయ భూమి కూడా ఉందని చూపారు. దీని తరువాతనే ఏకశిల నగర్ కాలనీకి చెందిన రోడ్డు ఉందని అన్నారు. ఈ రెండు రోడ్ల మధ్యన ఉన్న తన వ్యవసాయ భూమిని హైడ్రా అధికారులు రోడ్డుగా భావించి ప్రహరీ గోడను కూల్చివేశారని తెలిపారు.
తన వ్యవసాయ భూమికి చెందిన అన్ని పత్రాలను సంబంధిత అధికారులకు చూపించినా హైడ్రా అధికారులు పరిశీలించకుండా తొందరపాటు చర్యలు తీసుకుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా హైడ్రా అధికారులు వాస్తవాలను తెలుసుకొని న్యాయ బద్దమైన చర్యలు చేపట్టాలని మల్లారెడ్డి కోరారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి