– సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్
రుద్రంపూర్, ఫిబ్రవరి 05 : జరుగబోయే కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో లంబాడీ గిరిజనుల ఓట్లు గెలుచుకోవాలంటే వారి చిరకాల డిమాండ్లను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం, గిరిజన భవనం కోసం 3 ఎకరాల భూమిని కేటాయించే అభ్యర్థులకు, పార్టీలకే గిరిజనులు తమ ఓటు వేస్తారని స్పష్టం చేశారు.
– కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో లంబాడీ గిరిజన భవన నిర్మాణానికి స్థల కేటాయింపు
– సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి 3 ఎకరాల భూమి కేటాయింపు
– గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, స్థానిక రిజర్వేషన్ల అమలు
ఈ సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చి, గిరిజనుల ప్రయోజనాల కోసం పనిచేసే వారికే తమ మద్దతు ఉంటుందని సురేష్ నాయక్ ప్రకటించారు.