అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నూతనంగా నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
కట్టంగూర్, ఫిబ్రవరి 05 : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నూతనంగా నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ నగర్ ప్రజలకు ఎంతో కాలంగా ఉన్న కమ్యూనిటీ హాల్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యాక వివాహాలు, సమావేశాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అవకాశం ప్రజలకు లభిస్తుందన్నారు.
ప్రభుత్వం ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండు రాంబాబు, నాయకులు గద్దపాటి దానయ్య, మర్రి రాజు, అయితగోని నర్సింహ్మ, మిట్టపల్లి శివ, మేడి విజయ్, రెడ్డిపల్లి స్వామి, మేడి రాములు, మేకల జనార్దన్, మేకల రమేష్, ప్రశాంత్, వీరస్వామి, చెరుకు శ్రీను, కొంపెల్లి యాదయ్య, చంద్రయ్య, మైనం శివ, మద్దుల గణేష్, గంటికంపు లింగయ్య, ముశం ఉమేష్, వార్డు సభ్యులు కానుగు శ్రీను, మైనం ఉమాఅంబేద్కర్, అయితగోని సైదులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

