Devil Fishes | చర్లపల్లి, జూన్ 7 : మృత్స్యకారులకు జీవనోపాధిగా మారిన చర్లపల్లి చెరువులో టన్నుల కొద్దీ డెవిల్ ఫిష్ (దెయ్యం చేపలు) లు దర్శనమిచ్చాయి. దీంతో మృత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. మృగశిర కార్తె సందర్బంగా శనివారం చేపలు పట్టెందుకు వెళ్లిన మృత్స్యకారులకు దయ్యం చేపలు టన్నుల కొద్దీ వలలో రావడంతో వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
ఈ సందర్భంగా చర్లపల్లి మృత్స్యకారుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఈగ సత్యనారాయణ, విజయ్కమార్, ప్రతినిధి ఎంకిరాల నర్సింహ్మలు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేప పిల్లలను అందజేయడంతో చెరువులో వదిలామన్నారు. అయితే వీటితో దెయ్యం చేపల పిల్లలు రావడంతో టన్నుల కొద్ది చేపలు చెరువులో పెరిగాయన్నారు. అదేవిధంగా గత ఆరు నెలల క్రితం మూడున్నర లక్షల నిధులతో చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదిలిశామని.. దెయ్యం చేపలు చెరువులో వేసిన చేప పిల్లలను తింటున్నాయని.. చెరువు మొత్తం దెయ్యం చేపలతో నిండిపోయిందని వారు అవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత జిల్లా మృత్స్యకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు చెరువును సందర్శించి తమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి మృత్స్యకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు