Adultrated Toddy | కుత్బుల్లాపూర్‌లో కల్తీ కల్లు కలకలం.. దంపతులకు అస్వస్థత..!
Adultrated Toddy | నిజామాబాద్ జిల్లా భూపాల్ మండలం మంచి గ్రామానికి చెందిన ధరావత్ లచ్చిరాం (50), సాక్రిభాయ్(45) దంపతులతోపాటు కుమారుడు నిశాంత్‌లు గత ఆరు నెలల కిందట నగరానికి వలస వచ్చి సుభాష్ నగర్ డివిజన్ రామ్ రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు. వీరు ముగ్గురు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పలు కంపెనీలలో రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
Adultrated Toddy | కుత్బుల్లాపూర్/జీడిమెట్ల, జూలై 14 : నగరంలో కల్తీ కల్లు పంజా విసురుతుంది. ఇటీవల కూకట్పల్లి, బాలానగర్ పరిధిలో కల్లు కాంపౌండ్ లో కల్తీ కల్లు కాటేసింది. ఇది మరువక ముందే కుత్బుల్లాపూర్‌లో కల్లు కాంపౌండ్‌లో కల్లు సేవించిన ఓ ఇద్దరు దంపతులు అస్వస్థతకు గురి కావడంతో కలకలం రేపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా భూపాల్ మండలం మంచి గ్రామానికి చెందిన ధరావత్ లచ్చిరాం (50), సాక్రిభాయ్(45) దంపతులతోపాటు కుమారుడు నిశాంత్‌లు గత ఆరు నెలల కిందట నగరానికి వలస వచ్చి సుభాష్ నగర్ డివిజన్ రామ్ రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు. వీరు ముగ్గురు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పలు కంపెనీలలో రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం కుమారుడు నిశాంత్ రామ్ రెడ్డి నగర్, షాపూర్ నగర్ ప్రాంతాల్లో ఉన్న కల్లు కాంపౌండ్ల నుండి కల్లు ప్యాకెట్లను పార్సిల్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. శనివారం రాత్రి తల్లిదండ్రులు లచ్చిరాం, సాక్రిభాయ్లు సేవించగా మిగిలిన కల్లును ఆదివారం సాయంత్రం తిరిగి సేవించారు. దీంతో వారికి కాలు చేతులు లాగడంతోపాటు శరీరంలో కరెంట్ షాక్ తగిలినట్టు కావడంతోపాటు పిచ్చి చూపులు చూస్తూ ఉండడంతో కుమారుడు ఆదివారం రాత్రి 108 చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించాడు.
అక్కడ చికిత్స పొందిన అనంతరం తిరిగి సోమవారం ఉదయం తమ సొంత ఊరైన నిజామాబాద్‌కు వెళ్లారు. అయితే వారి ఆరోగ్యం ఇంకా మెరుగుపడకపోవడంతో నిజామాబాద్‌లో ఉన్న ఆస్పత్రిలో చూపించుకుంటామని బాధిత కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా ఆయా కల్లు కాంపౌండ్లలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మాధవయ్య, డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ నర్సిరెడ్డి, ఎస్ఐ ఆర్ రవితోపాటు సిబ్బంది జీడిమెట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు.
శాంపిల్స్ సేకరించాం : కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సీఐ యాదయ్య
షాపూర్ నగర్, రామ్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో ఉన్న కల్లు కాంపౌండ్లలో పర్యటించి అందులో అమ్ముతున్న కల్లు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ తరలించాము. అయితే పరీక్షల అనంతరం వచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.


Read Also :
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

