CI Narasimha Raju | బాలానగర్, ఏప్రిల్ 9 : రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని బాలానగర్ సీఐ నరసింహారాజు సూచించారు. ఇవాళ బాలానగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీ షీటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లుగా నమోదైన వారిపై నిరంతర నిఘా ఉంటుందన్నారు.
రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు ఆయన తెలిపారు. రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండాలని.. లేని పక్షంలో వారిపై పీడీ కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని హెచ్చరించారు.
రౌడీ షీటర్లు జనజీవన స్రవంతిలో కలసి హుందాగా జీవించేందుకు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. తొందరపాటుతనంతో చేసిన నేరాలకు శిక్షలు అనుభవించిన రౌడీలు ఇకనైనా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రామ్ నారాయణ, సరిత రెడ్డి, వినోద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ