కుల వివక్షతోనే పసిపాప మృతి
నాగర్‌కర్నూల్ జిల్లాలో కుల వివక్ష రెండు నెలల పసిగుడ్డు ప్రాణాలు తీసిందని, ఈ ఘటన అత్యంత బాధాకరమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విచారం వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్లిన రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబంపై దాడి చేసి పసిపాప మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంథనిలోని జ్యోతిబా పూలే విగ్రహం నుంచి అంబేదర్చౌరస్తా మీదుగా ఆర్డీవో కార్యాలయం దాకా మూతికి నల్లగుడ్డ కట్టుకొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి మౌన ర్యాలీ తీశారు.
- బాధ్యులను కఠినంగా శిక్షించాలి
- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని, ఫిబ్రవరి 26: నాగర్‌కర్నూల్ జిల్లాలో కుల వివక్ష రెండు నెలల పసిగుడ్డు ప్రాణాలు తీసిందని, ఈ ఘటన అత్యంత బాధాకరమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విచారం వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్లిన రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబంపై దాడి చేసి పసిపాప మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంథనిలోని జ్యోతిబా పూలే విగ్రహం నుంచి అంబేదర్చౌరస్తా మీదుగా ఆర్డీవో కార్యాలయం దాకా మూతికి నల్లగుడ్డ కట్టుకొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి మౌన ర్యాలీ తీశారు.
అనంతరం ఆర్డీవో సురేశ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధూకర్ మాట్లాడుతూ, పాప మృతి ఘటన గురించి వింటేనే మనం ఏ కాలంలో ఉన్నామో తెలియడం లేదన్నారు. కులాలను పుట్టించిన కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టించి అవమానపర్చడం సాధారణమైందన్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో రాజేశ్ అనే యువకుడు లాకప్ డెత్‌లో చనిపోతే, అకడ ఎస్‌హెచ్‌వోగా ఉన్న ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రక్షిస్తూ ఘటనకు బీసీ సామాజిక వర్గానికి చెందిన సీఐని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారని మండిప డ్డారు.
హోం శాఖను తన దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఘటనపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్‌గాంధీ ఇలాంటి ఘటనలపై స్పందించాలని హితవు పలికారు. ఇక్కడ భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేశ్, కౌన్సిలర్ మాచీడి రాజుగౌడ్, విలోచవరం సర్పంచ్ కొండా రవీందర్, నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, కాయితీ సమ్మయ్య, తిరుపతి, హరీశ్, ఆసీఫ్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

