హనుమకొండలో ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు
తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం విజయవంతంగా ముగిశాయి. రెండు రోజులు జరిగిన ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 1811 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు.
హనుమకొండ చౌరస్తా/కమాన్‌పూర్, ఆగస్టు 8 : తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం విజయవంతంగా ముగిశాయి. రెండు రోజులు జరిగిన ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 1811 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అండర్-18 (యూత్) బాలబాలికలు పంజాబ్‌లోని లూధియానాలో జరిగే నేషనల్ యూత్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
జాతీయ అథ్లెటిక్స్‌కు ఆనంది
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ చూపింది. అండర్-18 విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో 56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణ పతకం సాధించడంతో పాటు 21వ జాతీయ యువ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైంది. పంజాబ్‌లో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నది. ఆనంది కమాన్‌పూర్ (గుండారం) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. కాగా, ఆమె గతంలోనూ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించగా, మరోసారి సత్తా చాటి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

