హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఫలితాలు ప్రకటించలేదని దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చి వాదనలు వినాలని వార్డు కౌన్సిలర్ యాదగిరి ఇంప్లీడ్ పిటిషన్ వే శారు. దీనిపై అభ్యంతరాలుంటే తెలుపాలని ఎన్నికల అధికారి అయిన రంగారెడ్డి కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. చైర్మన్‌గా తన ఎంపిక ప్రక్రియ పూర్తయినా అధికారికంగా ప్రకటించలేదంటూ టేకుల సుదర్శన్‌రెడ్డి పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురువారం విచారించారు. కౌన్సిలర్ యా దగిరి కిడ్నాప్‌నకు గురయ్యారని ఆయన కొ డుకు గతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వే శారని, ఈ పిటిషన్‌ను గతంలో విచారించిన హైకోర్టు, ఎన్నికను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని న్యాయవాది చెప్పారు.
ఈ ఉత్తర్వులను అధికారులు అందుకునేటప్పటికే ఎన్నిక పూర్తయిందని తెలిపారు. అధికారికంగా ప్రకటించలేదన్నారు. కిడ్నాప్ అయ్యారనుకున్న యాదగిరి ఎన్నికల్లో కూడా పాల్గొన్నారని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలను అనుమతించాలని హై కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. 24మంది వార్డు సభ్యుల్లో 13 మంది బీఆర్ఎస్ వారని తెలిపారు. బీజేపీ కౌన్సిలర్లలో ఒకరు, స్వతం త్ర కౌన్సిలర్ ఒకరు బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారని, వీడియో కూడా ఉన్నదని చెప్పారు. తమ ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించాలని యాదగిరి తరఫు న్యాయవాది కోరారు. ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది తెలిపారు.