హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖ ఆధ్వర్యంలో పలు సొసైటీలు, విభాగాల్లో పని చేస్తూ.. 010 పద్దులో లేని టీచర్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు చావ రవి, ఏ వెంకట్ డిమాండ్ చేశారు. గురువారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందజేశారు.
010 పద్దు ద్వారా వేతనాలు పొందలేని మాడల్ స్కూల్, గురుకులాల సొసైటీ, ఎయిడెడ్, కాలేజీలు, యూనివర్సిటీలు, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షతోపాటు పలు రకాల పబ్లిక్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని యూటీఎఫ్ నాయకులు తెలిపారు.