నివేదిక ఆధారంగానే మర్డర్ కేసు.. కుమ్మెర ఘటనపై ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్
కుమ్మెర ఘటనలో చిన్నారి మృతికి సంబంధించి నివేదిక రావాల్సి ఉన్నదని, దాని ఆధారంగానే అవసరమైతే మర్డర్ కేసు నమోదు చేస్తామని నాగర్‌కర్నూల్ ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ తెలిపారు. దాడి జరగడం వల్లే చిన్నారి మరణించిందని రిపోర్టులో తేలితే కేసులో తగిన సెక్షన్లు జోడిస్తామని పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 26 : కుమ్మెర ఘటనలో చిన్నారి మృతికి సంబంధించి నివేదిక రావాల్సి ఉన్నదని, దాని ఆధారంగానే అవసరమైతే మర్డర్ కేసు నమోదు చేస్తామని నాగర్‌కర్నూల్ ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ తెలిపారు. దాడి జరగడం వల్లే చిన్నారి మరణించిందని రిపోర్టులో తేలితే కేసులో తగిన సెక్షన్లు జోడిస్తామని పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో చంద్రకళ, బూరమ్మ వారి కుటుంబ సభ్యులు ఆలయానికి వచ్చినట్టు తెలిపారు. దర్శనం కోసం శ్రీనివాస్‌రెడ్డి డబ్బులు అడిగి దర్శనానికి వెళ్లకుండా ఆపాడని చంద్రకళ తెలిపారని, దీంతో చంద్రకళ వారితో వాగ్వాదానికి దిగి దుర్భా షలా డిందని చెప్పారు. పూజారి పెద్దసాయిలు చెప్పిన ప్ర కారం వారు బారికేడ్‌ను దాటడానికి ప్రయత్నించినప్పుడు ఎక్కువ మంది దర్శనం కోసం నిలబడి ఉన్నారని, క్యూలో ముందుకు వెళ్లాలని చెప్పినట్టు పేర్కొన్నారు.
‘నా ఇష్టం.. ఏం చేస్తావో చేసుకో’
ఆ తర్వాత చంద్రకళ తన కుటుంబ సభ్యులతో కిందికి వచ్చి తన కుమారుడు గణేశ్‌కు ఫోన్‌చేసి జరిగిన ఘటన గురించి చెప్పడం, సాయంత్రం సమయంలో గణే శ్ కుమ్మెర గ్రామ వా ట్సాప్ గ్రూప్‌లో శ్రీనివాస్‌రెడ్డిని తి డుతూ ఒక ఆడియో మెసేజ్ పోస్టుచేసినట్టు చెప్పారు. ఆ ఆడియోను విన్న నరేశ్ అనే వ్యక్తి శ్రీనివాస్‌రెడ్డికి తెలుపడం, ఆ తర్వాత గణేశ్ ఆ మెసేజ్‌ను డిలీ ట్ చేశారని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి ఎదురుపడినపుడు గణేశ్ తన తల్లిని, కుటుంబ సభ్యులను ఎందుకు తిట్టావని ప్రశ్నించాడని పేర్కొన్నారు. ‘నా ఇష్టం.. నేను ఆడియోలో ఏం చెప్పాలో చెప్తాను, ఏమి చే స్తావో చేసుకో’ అంటూ అశ్లీల భాష వాడాడని, ఆ తర్వా త రాయితో శ్రీనివాస్‌రెడ్డి తలపై కొట్టడంతో గాయమైందని, ఆ సమయంలో శ్రీనివాస్‌రెడ్డి, ఇతరులు కలిసి గ ణేశ్, చంద్రకళను కొట్టారని ఎస్పీ తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డికి గాయాలు కావడంతో అక్కడున్న ఇతరులు సైతం గణేశ్‌ను కొట్టారని పేర్కొన్నారు.
గణేశ్ తన పిటిషన్లో శ్రీను, మధు, సతీశ్‌రెడ్డి, పవ న్, కన్నీ, శ్రీకాంత్‌రెడ్డి, నరేశ్‌లపై ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఆ సమయంలో గణేశ్ 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారని, ఆ తర్వాత ఇద్దరు ఫిర్యాదు చేయగా కౌంటర్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గణేశ్ మొదట ఇచ్చిన ఫిర్యాదులో తన భార్య, పాపపై దాడి గురించి ప్రస్తావించలేదని అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి.. తన భార్యను కులం పేరుతో తిట్టినట్టుగా కూడా గణేశ్ పిటిషన్లో పేర్కొనలేదని తెలిపారు. 21వ తేదీన పాప చనిపోయే వరకు ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారని అడిగితే వివరాలు ఇవ్వలేదని, ఘటన జరిగినప్పటి నుంచి చనిపోయే వరకు పాపకు ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా సాక్ష్యం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసిన తర్వాత కాంపెన్సేషన్ త్వరగా ఇవ్వాలని అధికారులు ప్రయత్నించారని, ఆర్డీవో, తహసీల్దార్ పలుమార్లు రిక్వెస్ట్ చేసినా ఆ కుటుంబం సహకరించడం లేదని, ఆధార్, రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డులు ఇవ్వలేదని చెప్పారు.
విచారణకు సహకరించాలి
ముఖ్యంగా 18న జాతరలో నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు సాక్షులను గుర్తించి స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పాప కుటుంబ సభ్యులపై తమకు సానుభూతి ఉంటుందని, విచారణలో కుటుంబ సభ్యులు సహకరించాలని కోరారు. హిస్టోపాథాలజీ, విసెరా రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయని, ఏదైనా చిన్న సాక్ష్యం దొరికినా, గాయాల వల్ల పాప చనిపోయినట్టు తెలిస్తే కేసులో మర్డర్ సెక్షన్లు కూడా చేర్చి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

