కుమ్మెర బాధితులను ఆదుకోకుంటే ఉద్యమమే
కుమ్మెర బాధితులను రెండు వారాల్లోగా ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. కుమ్మెర బాధితులు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చేపడుతున్నా ధర్నా శిబిరాన్ని గురువారం తలసాని సందర్శించి సంఘీభావం తెలిపారు.
- రెండు వారాల్లోగా ప్రభుత్వం న్యాయం చేయాలి
- గణేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటది
- మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- నాగర్‌కర్నూల్‌లో బాధిత కుటుంబానికి పరామర్శ
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 26 : కుమ్మెర బాధితులను రెండు వారాల్లోగా ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. కుమ్మెర బాధితులు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చేపడుతున్నా ధర్నా శిబిరాన్ని గురువారం తలసాని సందర్శించి సంఘీభావం తెలిపారు. గణేశ్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. వీరికి పోలీసులు వంతపాడుతున్నారని విమర్శించారు. కుమ్మెర ఘటన సీఎం సొంత జిల్లాలో జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
రజక కుటుంబంపై దాడి ఘటనలో పసికందు చనిపోయినా సీఎం స్పందించకపోవడం దారుణమని అన్నారు. పసిగుడ్డును కోల్పోయిన ఆ తల్లి కడుపుకోతను ఎవరు తీర్చగలరని ప్రశ్నించారు. బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఐక్యంగా ఉండి ఇలాంటి ఘటనలను ఎదురించినప్పుడే ప్రభుత్వాల మెడలు వంచడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కుమ్మెర ఘటనలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి సీఐ ఒక విధంగా, డీఎస్పీ మరోవిధంగా, ఎస్పీ ఇంకో రకంగా మాట్లాడటం సరికాదని అన్నారు. బాధితుడు గణేశ్ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కేసు నమోదు చేయాల్సి ఉన్నా.. 3 గంటలపాటు స్టేషన్లో కూర్చోబెట్టి.. ఫిర్యాదు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ దాడిలోనే రెండు నెలల శిశువు గాయపడి చనిపోయిందని కన్నతల్లి చెప్తున్నా నిందితులపై మర్డర్‌కేసు పెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులపై మర్డర్ కేసు పెట్టి జైలులో పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా బహుజనులమంతా కలిసి రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. గణేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఈ విషయంలో కేటీఆర్ హామీ ఇ చ్చారని, అన్ని విధాలా ఆదుకుంటామని భరో సా కల్పించారు. అసెంబ్లీలోనూ ఈ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బైకాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

