Construction workers | జగద్గిరిగుట్ట, ఏప్రిల్ 1 : అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు కోరారు. రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీ నగర్ ఆస్బెస్టాస్ కమాన్ వద్ద ఇవాళ భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. కార్మికుల అడ్డాల్లో కనీస వసతులు, 65 ఏళ్ల వారికి రూ. 10 వేల పెన్షన్ అందించాలన్నారు.
సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వివరిస్తామన్నారు. చెట్టినాడ్ సిమెంట్ ప్రతినిధులు పని చేసే చోట కార్మికులు తీసుకోవలసిన జాగ్రత్తలు, సేఫ్టీ పరికరాల గురించి వివరించారు. ఈ సమావేశంలో ఐలయ్య, రషీద్, మదన్, సాయి, యూసఫ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి