Congress Vs Bjp | మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 1 : అధికార పార్టీ నేతలం రాకముందే రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని అడ్డు చెప్పడమే కాకుండా.. కాంగ్రెస్ నాయకులు ఏకంగా రేషన్ దుకాణానికి తాళం వేశారు . మేడ్చల్ మండలంలోని శ్రీరంగవరం గ్రామంలో ఇవాళ ఉదయం ప్రభుత్వం రేషన్ దుకాణం ద్వారా ప్రజలకు అందజేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ నాయకులు ప్రారంభించారు.
అనంతరం అక్కడకు చేరుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు సన్న బియ్యాన్ని అందజేస్తున్న రేషన్ డీలర్‌ను నిలదీశారు. తాము రాకముందే కార్యక్రమాన్ని ఎలా మొదలు పెట్టారని ప్రశ్నించడమే కాకుండా ఏకంగా రేషన్ దుకాణానికి తాళం వేశారు. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని తామే ప్రారంభించాలని వారు భీష్మించుకు కూర్చున్నారు. అనంతరం గ్రామ ప్రజలు, రేషన్ డీలర్ పద్మారెడ్డి వారిని సముదాయించి సుమారు 11. 30 గంటల సమయంలో దుకాణం తాళం తెరిచి తిరిగి బియ్యం పంపిణీని ప్రారంభించారు.
తాళం వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకుల డిమాండ్
శ్రీరంగవరం గ్రామంలో ఇవాళ ఉదయం రేషన్ దుకాణానికి తాళం వేసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ పోచయ్య డిమాండ్ చేశారు.
ఉదయం 8 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాలని గ్రామంలో సమాచారం ఇవ్వగా తమ పార్టీ నేతలు సమయానికి దుకాణం వద్దకు చేరుకుని ప్రజలు రావడంతో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అనంతరం అక్కడకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు తాము రాకముందే బియ్యం పంపిణీని ఎలా ప్రారంభిస్తారని రేషన్ డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి బియ్యం పంపిణీకి అడ్డుపడి రేషన్ దుకాణానికి తాళం వేశారని ఆరోపించారు.
పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం పంపిణీని రాష్ర్ట ప్రభుత్వమే ఇస్తున్నదని గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ కుటిల ప్రయత్నాలు చేయడం సమంజసం కాదన్నారు. అంతే కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా అడ్డు తగిలే వారిపై అధికారులు చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి