Congress Leaders | శామీర్పేట, ఏప్రిల్ 9 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ చరిత్ర వక్రీకరిస్తుందని ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలుయాదవ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేశ్యాదవ్లు అన్నారు. మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో ఇవాళ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం తెచ్చి, నవ భారతాన్ని నిర్మించి, దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధితోపాటు భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశంలోని అణగారిన వర్గాల సంక్షేమం కోసం , బడుగు బలహీన వర్గాల ఔన్నతి కోసం ప్రజలంతా సమానమేనని భావించి, భారత రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు.
కానీ నేడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తూ అవహేళన చేస్తుందని, మనుధర్మ శాస్త్రం, సనాతన ధర్మం పేరుతో బీజేపీ కులమతాల మధ్య, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి దేశంలో కల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ మెంబర్ జైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గోనె మహేందర్ రెడ్డి, మూడు చింతలపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, శామీర్ పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యాష్కీ శంకర్ గౌడ్, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిపేట్ శ్రీనివాస్, దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పా రామ రావు, మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి జగన్నాథం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ