Mekala Kavya | జవహర్‌నగర్, ఫిబ్రవరి 10: బీసీల సంఖ్య పెరిగితే.. వాటా అడుగుతారనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన అసంబద్ధంగా చేసిందని బీసీల గొంతుక, జవహర్‌నగర్ మాజీ మేయర్ కావ్య మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 51శాతం ఉన్న బీసీలు 46శాతమే ఉన్నారని కాకిలెక్కలు ప్రభుత్వం చూపించిందని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఓ బూటకమని ఆరోపించారు.
42శాతం కోటాతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, కులగణన సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో చేసిన కులగణన సర్వేనే పక్కాగా ఉందని, బీసీల్లో చైతన్యం వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుందని చెప్పిన కావ్య.. బీఆర్ఎస్ బీసీలకు అగ్రస్థానం కేటాయించిందని తెలిపారు. 10 ఏండ్లతర్వాత చేసిన సర్వేలో బీసీల జనాభా పెరుగుతుందే తప్పితే… తాజా సర్వేలో 22లక్షల బీసీల జనాభా ఎలా తగ్గుతుందని, తగ్గడానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని మేకల కావ్య డిమాండ్ చేశారు.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్