Fogging | రామంతాపూర్, మే 29 : రాబోయే వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అన్ని డివిజన్లలో ఫాగింగ్ , స్ప్రే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిన అధికారులు, మొదటగా రామంతాపూర్ డివిజన్లో ఈ రోజు ఆధునిక పరికరాలు 8 చిన్న మిషన్ లు 2 పెద్ద మిషన్లతో కూడిన ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు గురువారం ప్రారంభించారు. సీజనల్ వ్యాధుల వల్ల వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలుగా ఈ ఫాగింగ్ నిర్వహణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎస్ఈ మాధవ రెడ్డి, ఏఈ నరేష్ రెడ్డి, సూపర్వైజర్ మహేందర్, యువమోర్చ నాయకులు, మసిరెడ్డి ప్రభాకర్, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం