MLA KP Vivekaknand | దుండిగల్, మే 25: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కాలనీలు, బస్తీలను ప్రణాళిక బద్దంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజుల రామారం డివిజన్ పరిధిలోని వీనస్ రాక్స్ హైట్స్ లో సుమారు రూ. 36.80 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఇవాళ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్నీ ప్రాంతాలలో మౌలిక వసతులను కల్పించామన్నారు. రానున్న రోజుల్లో కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను ప్రణాళిక బద్దంగా, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ది పరుస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, చెట్ల వెంకటేష్, తెలంగాణ సాయి, చిన్నా చౌదరి, సమ్మయ్య యాదవ్, బాబీ చౌదరి, దూలప్ప, శివా నాయక్, జునైద్, ఆసిఫ్, ప్రసాద్, వీనస్ రాక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీసీ వేమా రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళీధర్ రెడ్డి, సలహాదారులు శివరాం ప్రసాద్, శంకర్ రెడ్డి, మధు, సంయుక్త కార్యదర్శి బాల నాగ దుర్గా, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.