CITU | జహీరాబాద్ , జూన్ 5 : మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమల్లో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ 4వ సారి విజయ డంకా మోగించింది. గురువారం స్థానిక కర్మాగారంలో జరిగిన ఎన్నికల్లో సీఐటీయూకు 270, ఐఎన్టీయూసీకి 269 ఓట్లు రాగా నాలుగు ఇన్వాలిడ్ అయ్యాయి. దీంతో సీఐటీయూ తరఫున పోటీ చేసిన చుక్కా రాములు ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, మహేంద్ర ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు చుక్కారాములు మాట్లాడుతూ కార్మికులు కార్మికుల ఐక్యతకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామన్నారు. కార్మికుల ఐక్యతతోనే విజయం సాధించామని కార్మికులకు సీఐటీయూ తరఫున ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. కార్మికుల హక్కులకు కట్టుబడి ఉన్నామని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యావత్తు పూర్తిగా స్థాయిలో విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తూ భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు సైతం ఈ దాంట్లో ఎన్నికల్లో కృషి చేసినా, బెదిరించినా కార్మికులు సిఐటియును గెలిపించడం ఎర్రజెండాను, ఐక్యతను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నానికి నిదర్శనమని కార్మికులకు సీఐటీయూ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు విజయం సాధించిన సందర్భంగా కార్మికుల భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తూ బాణాసంచా పేలుస్తూ విజయోత్సవ ర్యాలీని ముందుకు తీసుకెళ్లారు. వందలాది మంది కార్మికులు చుక్కారాములును అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, కార్యదర్శి సాయిలు, నాయకులు రాజిరెడ్డి కనకారెడ్డి నరేష్ నారాయణ వివిధ పరిశ్రమల నాయకులు పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు