దుండిగల్, మార్చి6: బాచుపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరన వేగంతో వచ్చిన వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న పలు షాపులను ఢీకొట్టింది. చివరకు ఓ ప్రైవేటు స్కూల్ ప్రహారీ గోడను ఢీకొట్టడంతో ఆగిపోయింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌లోని ఐడీపీఎల్‌కు చెందిన విష్ణువర్దన్ రెడ్డి అనే యువకుడు గురువారం ఉదయం హ్యుందాయి వెర్నా కారు(TS 14 EX7200)లో ప్రగతి నగర్ కమాన్ వైపు నుండి బాచుపల్లి వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలోబాచుపల్లిలోని వీఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ సమీపంలో మితిమీరిన వేగం కారణంగా కారు అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే పాపయ్య అనే వ్యక్తికి చెందిన చెరుకు రసం బండితో పాటు.. పక్కనే ఉన్న సెల్‌ఫోన్ యాక్ససరీస్ షాపును ఢీకొట్టింది. అప్పటికీ కారు కంట్రోల్ కాకపోవడంతో పక్కనే ఉన్న వీఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి ప్రైవేటు పాఠశాల ప్రహారీని ఢీకొట్టింది. అప్పుడు కారు ఆగిపోయింది.
ఈ ప్రమాదంలో మొబైల్ యాక్ససరీస్ డబ్బా పూర్తిగా ధ్వంసం కాగా, అందులోని సామాను సైతం పాడైపోయింది. అదే సమయంలో చెరుకు రసం బండి సైతం దెబ్బతిన్నది. కారు గోడకు ఢీకొట్టడంతో కారు ముందు భాగంతో పాటు ప్రహారీ గోడ కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. చెరుకు రసం బండి యజమాని పాపయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మితిమీరిన వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ప్రమాదంలో మొబైల్ యాక్సెసరీస్ డబ్బా ధ్వంసం కాగా అందులోని సామాను సైతం పాడైంది. అదే సమయంలో చెరుకురసం బండి సైతం దెబ్బతింది. కారు గోడకు ఢీకొట్టడంతో కారు ముందు భాగంతో పాటు ప్రహ రి గోడ సైతం స్వల్పంగా దెబ్బతింది. చెరుకు రసం బండి యజమాని పాపయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగం కారణంగానే కారు అదుపుతప్పి ప్రమాదం సంభవించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు .