BRS Rajathostsava Sabha | బాలానగర్, ఏప్రిల్ 20 : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దండుగా తరలిరావాలని ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ ఓల్డ్ బోయిన్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్ నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రజతోత్సవ సభ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అన్నారు. రజతోత్సవ సందర్భంగా కాలనీలు బస్తీలలో పార్టీ జెండాలు ఆవిష్కరించి వేడుకగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండబెట్టడానికి రజతోత్సవ సభ వేదిక కానుంది అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కండ్లకు కట్టినట్టు ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు, అభిమానులు రజతోత్సవ సభకు దండుగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్రే జంగయ్య, నియోజకవర్గం మైనార్టీ నాయకులు సయ్యద్ ఎజాజ్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్, రాజు గౌడ్ బాలరాజ్, ఖదీర్, పిట్ల రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?