Rythu Bharosa | ఇబ్రహీంపట్నం, జూన్ 23 : రైతులందరికి రైతు భరోసా ఇచ్చేవరకు పోరాటాలు నిర్వహిస్తామని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేష్, సహకార సంఘం ఛైర్మన్ మహేందర్రెడ్డిలు అన్నారు.
సోమవారం ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో శివారు ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లోని రైతులకు రైతుభరోసా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎలిమినేడు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన రైతులందరికి రైతుభరోసా సాయం అందించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా కొన్ని మండలాల్లో రైతు భరోసాకు కోత విధించటం సరైన పద్దతి కాదని హెచ్చరించారు. అర్హులైన రైతులందరికి రైతుభరోసా అందించే వరకు బీఆర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.
ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి కుర్చీలో కూర్చున్న తర్వాత ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలి కొదిలేసి పేద ప్రజలు, రైతుల జీవితాలతో చలగాటమాడుతున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రైతుభరోసా అందించే వరకు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
రైతుభరోసా సాయం అందించే వరకు గ్రామగ్రామాన ఉద్యమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ రైతు మొద్దు అంజిరెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, శేఖర్గౌడ్తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన