బోడుప్పల్, మార్చ్ 14: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి విమర్శించారు. శాసనసభ నుండి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై(MLA Jagadish Reddy) సస్పెన్షన్ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిరసిస్తూ శుక్రవారం పార్టీ కార్యాలయం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్రజా సమస్యలపై గలమెత్తుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని శాసనసభ నుండి సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చర్యని బోడుప్పల్ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు ఛీకొడుతున్నారన తెలిపారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చివాత పెట్టేందుకు సిద్దంగా ఉన్నారని నేతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, నాయకులు రవి గౌడ్, రామచంద్రారెడ్డి, చక్రపాణి గౌడ్, ఉప్పరి విజయ్, సత్యం రెడ్డి, నరసింహ, శంకర్, శ్రీధర్ గౌడ్, శత్రుజ్ఞ, దుర్గపు కృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.