protocall | బోడుప్పల్, సెప్టెంబర్17 : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో అధికారులు ఫ్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. బుధవారం బోడుప్పల్ కార్పొరేషన్ తొలి మేయర్ సామల బుచ్చిరెడ్డి, స్థానిక తాజా మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు కమిషనర్ శైలజను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో అధికారులు పనిచేయడం తగదని, నాలుగు సంవత్సరాలు మేయర్‌గా విధులు నిర్వహించిన సామల బుచ్చిరెడ్డికి అధికారికంగా నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల కనీస వివరాలను తెలుపడం లేదని ధ్వజమెత్తారు. నాలుగు నెలలు మేయర్ విధులు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సంజీవరెడ్డి నిలదీశారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి, ఇతర పార్టీకి చెందిన ఎంపీకి కూడా ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపించారు.
అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలు పట్టించుకోరా…?
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంలో ఆంతర్యమేంటని సంజీవరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇందులో అధికారులకు వాటా ఉందా.. ? లేకుంటే ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు రాంచంద్రారెడ్డి, చక్రపాణీగౌడ్, రవిగౌడ్,యాదగిరి, ఉప్పరివిజయ్, మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, అలీం, శత్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి నీరజ్ చోప్రా
Ramavaram : ఎస్పీ ఆదేశాలు బేఖాతరు.. బ్లాక్ స్పాట్స్ గుర్తింపులో నిర్లక్ష్యం
Nidamanoor : గౌండ్లగూడెంలో నూతన బోర్ మోటార్ ప్రారంభం