ఘట్కేసర్ రూరల్: ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని ముదిరాజు కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి బోనాల పండుగ వేడుకల్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ముదిరాజుల కులదైవంగా ప్రార్థించే పెద్దమ్మ తల్లి అమ్మవారి బోనాల వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
దైవభక్తి కలిగిన ప్రతి ఒక్కరు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బైనగారి నాగరాజు, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు సుదర్శన్, పంచాయతీ సభ్యులు రాంచందర్, అంజమ్మ, సత్తయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నర్సింహ్మ, ఉపాధ్యక్షుడు బాలయ్య, నాయకులు బస్వరాజ్, ఆనంద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.