Team India | ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియా, నేడు అమెరికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు విజయాన్ని కాంక్షిస్తూ భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ముంబైలోని శ్రీ సిద్ధీవినాయక గణపతి ఆలయాన్ని దర్శించుకున్నారు. సపోర్ట్ స్టాఫ్ సభ్యులతో కలిసి ఈ స్పిన్ ద్వయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇక సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు అమెరికాతో తలపడబోతుంది.
2024లో విశ్వవిజేతగా నిలిచిన భారత్, ఇప్పుడు స్వదేశంలో ఆ టైటిల్ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకపోయినప్పటికీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లతో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. అయితే గాయం కారణంగా హర్షిత్ రాణా దూరం కావడంతో అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు.
#WATCH | Indian cricketers Kuldeep Yadav and Varun Chakravarthy, along with members of the support staff, offered prayers at the Shri Siddhivinayak Ganpati Temple in Mumbai for Team India’s victory as they kick off their campaign to defend the ICC Men’s T20 World Cup.
India to… pic.twitter.com/WPnh7A0iQq
— ANI (@ANI) February 7, 2026