హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ) : ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ప్రస్తుతానికి రాష్ట్రమంతటా అమలు కావడం లేదని ఈహెచ్ఎస్ ట్రస్టు సీఈవో ప్రకటనలో తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో రాష్ట్రమంతటా ఈహెచ్ఎస్ స్కీమ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 17 జిల్లాల్లో 153 నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ పథకం అమలవుతున్నట్టు తెలిపారు. 437 మంది 1.14కోట్ల విలువైన చికిత్సలు పొందారని వెల్లడించారు.
గిరిజన హస్తకళలకు మారెట్ సదుపాయం ; గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వరరెడ్డి
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): గిరిజన హస్తకళలకు జాతీయస్థాయిలో మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నామని గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వరరెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రైఫెడ్ (గిరిజన సహకార సంస్థ) సహకారంతో రాష్ట్ర గిరిజన కళాకారులతో ప్రత్యేక సమావేశాన్ని సంక్షేమ భవన్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 116 ట్రైఫెడ్ విక్రయశాలల్లో తెలంగాణ గిరిజన హస్తకళాఖండాలను విక్రయించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. కార్యక్రమంలో ట్రైఫెడ్ రీజినల్ మేనేజర్ భాసర్ ఝౌ, డిప్యూటీ మేనేజర్ శివ చల్వాడి, మారెటింగ్ మేనేజర్ రాంబాబు, గిరిజన పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ సముజ్వల, గిరిజన మ్యూజియాల సంరక్షకుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, చీఫ్ ఇంజినీర్ బాలునాయక్, ఎస్ఈ హేమలత తదితరులు పాల్గొన్నారు.