జమ్ము: దోడాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్(జీఎంసీ) గైనకాలజీ విభాగం లేబర్ రూమ్‌లోకి బుర్ఖా ధరించి ప్రవేశించడాన్ని అడ్డుకున్నారని ఆరోపిస్తూ, పలువురు నర్సులు నిరసనకు దిగారు. బుధవారం నాడు గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ మధు చిబ్.. బుర్ఖా ధరించినందుకు ఒక నిర్సింగ్ విద్యార్థినిని లేబర్ రూమ్ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించడంతో ఈ వివాదం మొదలైంది. దవాఖాన యాజమాన్యం రంగంలోకి దిగి, ఈ అంశంపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇర్ఫాన్ తస్సదుక్ స్పందిస్తూ, నిబంధనల ప్రకారం వదులుగా ఉండే దుస్తులను సరిచేసుకుని, వాటిపై మెడికల్ గౌన్ ధరించాలని మాత్రమే డాక్టర్ చిబ్ సూచించారని వివరించారు. ఈ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ అధికార ప్రతినిధి తన్వీర్ సాధిక్ స్పంది స్తూ, భారత రాజ్యాంగం పౌరులకు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు కల్పించిందన్నారు.