భద్రాద్రి కొత్తగూడెం.. ఫిబ్రవరి 7 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర సూటిగా ప్రశ్నించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 53,54,29,30 వార్డుల్లో ప్రచారం చేసి మాట్లాడారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో అధికారులకు వచ్చిందని, రెండేళ్లయినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేవలం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బూతు పిత అన్నారు. నో రిప్పితే అబద్ధాలు అడ్డగోలు ప్రేలాపణలు తప్ప అభివృద్ధి కోసం మాట్లాడే శక్తి లేదన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, రావులపల్లి రాంప్రసాద్, అభ్యర్థులు మహేష్, పద్మ.. సాగర్, రాజేష్, కాపు కృష్ణ, బొమ్మిడి రామకాంత్, మామిడి శ్రీను, కరాటే శ్రీను, తదితరులు పాల్గొన్నారు.