Pawan Kalyan | పవన్ కళ్యాణ్ డబుల్ ధమాకా .. సురేందర్ రెడ్డి మూవీ ఎప్పటి నుండి ప్రారంభం అంటే..!
Pawan Kalyan | పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులకు వచ్చే నెల నిజంగానే డబుల్ ట్రీట్ కానుంది. ఒకవైపు ఆయన హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు కొత్త సినిమాకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరికొత్త స్టైలిష్ లుక్లో కనిపిస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది.
Pawan Kalyan | పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులకు వచ్చే నెల నిజంగానే డబుల్ ట్రీట్ కానుంది. ఒకవైపు ఆయన హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు కొత్త సినిమాకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరికొత్త స్టైలిష్ లుక్లో కనిపిస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే నెలలో ఆయన కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కానుంది. ఉగాది సందర్భంగా మార్చి 19న పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమాకు రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ తొలి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారని, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కనిపిస్తున్న స్టైలిష్ లుక్ కూడా ఈ సినిమాకోసమే రెడీ చేసినదేనని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘ఓజీ’ చిత్రంలో ముంబై గ్యాంగ్స్టర్గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ను అదే తరహా పాత్రల్లో చూడాలని నేటి తరం ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆ అభిరుచిని దృష్టిలో పెట్టుకుని మరోసారి గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ కథనే ఎంచుకున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాబోయే ఈ సినిమా ‘ఓజీ’ కంటే కూడా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నటీనటుల వివరాలు, ముఖ్యంగా విలన్ పాత్రలో ఓ ప్రముఖ హీరో కనిపించే అవకాశం ఉందన్న ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, రోజుకు 6–7 గంటలు సినిమా షూటింగ్కు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. అవసరాన్ని బట్టి పగలు లేదా రాత్రి షూటింగ్లో పాల్గొంటారని టాక్. మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

