కోరుట్ల :జగిత్యా జిల్లా కోరుట్ల పట్టణంలో రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరపాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. మంత్రి ప్రసంగిస్తున్నారని అరగంట పాటు శవ యాత్రను అడ్డుకున్నారు. మృతురాలి బంధువులు అరగంట పాటు ఎండలో మృతదేహంతో రహదారిపై వేచివున్నారు. పట్టణానికి చెందిన కొమ్మనపల్లి శశికళ రాత్రి క్యాన్సర్ వ్యాధితో మృతి చెందింది. మృతదేహాన్ని ఊరేగింపుగా స్మశాన వాటికకు తీసుకెళుతున్న సందర్భంగా రహదారిపై మంత్రి ప్రసంగిస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ప్రసంగం పూర్తి అయ్యే వరకు అడ్డుగా నిలబడి శవ యాత్ర ను అడ్డుకోవడం విస్మయానికి గురి చేసింది. పాత్రికేయులు ఘటనా స్థలికి చేరుకునే సరికి పోలీసులు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, శవ యాత్రకు అనుమతిచ్చారు. పోలీసుల తీరుపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
