MLA bandari lakshma reddy | రామంతాపూర్, మే 31 : పాత్రికేయ మిత్రుడు, ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యుడు మాదిరాజు సురేష్ అకాల మరణం బాధాకరం అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మాదిరాజు సురేష్ అంత్యక్రియల కోసం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ఎమ్మెల్యే పంపించిన ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ మాదిరాజు సురేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అదే విధంగా పలు పార్టీల నాయకులు, సురేష్ మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఉప్పల్ జర్నలిస్టు సంఘం నాయకులు వెంకట్రామ్ రెడ్డి, ఎం రాంప్రసాద్ శర్మ, కే శ్రీనివాస్, శ్రీహరి, శ్రీశైలం, తిరుపతిరెడ్డి, శేఖర్, అశోక్, కిషోర్, శివాజీ, యాదగిరి తదితరులు సురేష్‌కు నివాళులు అర్పించారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత